స్వగతం

నా ఆత్మ ఘోష

Saturday, December 08, 2007

అనూష కు జన్మదిన శుభాకాంక్షలు

విను వీధి న ఆ తార,
ధాత్రి దరి ఈ సితారను కాంచి సిత్రముల్ బోయె!

నెలరేని సొగసుల గుబగుబలు,
ఈ రాగరంజిత లయల హొయల ముందు వెలెవెల బోయె!

అనంతవాహినీ గంగాప్రవాహము,
ఆ ప్రఫుల్లవదనారవిందకాంతులందు కనుమరుగాయె!

అజాత శతృవగు ధర్మజునకు,
ఆ స్నేహ సౌశీల్యమే జాత శతృవాయెగదా!

అనురాగార్ణవంలో దరహాసపు ఉష
రాగాల మణిపూస
మా ఈ గారాల అనూష కి,
హార్దిక జన్మదిన సుభాకాంక్షలు,

-అంకుల్ సోమా ధవళ

Tuesday, January 10, 2006

మావయ్య సందేశం

ప్రియమైన శేఖర్ కి,

ఈ కొత్త సంవత్సరం నీకు మంచు శిఖరాల నుంచి,
మానస సరోవరాలనుంచి,
మంచితనాన్ని, స్వచ్చతని మోసుకొచ్చి,
మధురమైన అనుభూతి గా మిగులుగాక!!

- నాగరాజు పప్పు

Wednesday, December 28, 2005

ఇంధ్రధనస్సు

రంగు రంగుల బాహ్యప్రపంచంలో అన్ని రంగులూ నలుపే!
ఆ నలుపుటంచులలో నిఘూఢమైన ఇంధ్రధనస్సుని ఆవిష్కరించడమేనా ఈ జీవిత సంఘర్షణ పరమార్ధం!
అదేనా ధ్యేయం, అది తెలుసుకోవడమే నా ధ్యేయం!

Wednesday, June 22, 2005

వర్షం

నేలని ముద్దెడదామని నింగి చేసిన నీరు గారిన ప్రయత్నమే వర్షం

Tuesday, June 21, 2005

ఛానల్ వి3

వి3 అంటె: వంటలూ-వార్పులూ-వడ్డింపులూ అన్నమాట!
ఛానల్ వి3 నల-భీముల చేత ribbon cutting చేయించబడినది..
ఇక విషయానికి వస్తే... ఈ ఛానల్ లో నలభీమ పాకాలు ఎలా చేయాలో, శ్రోతలకు, ప్రేక్షకులకు, పాక శాస్త్ర ప్రవీణులచేత భోదించబడతాయి....
వడ్డింపులు ఎలాంటివైనా కావొచ్చు ...
ఈ blog లో ఆకాకరకాయ పుల్లా-బెల్లం ఎలా చెయ్యాలో నేర్చుకుందాం..
తినబొతూ రుచి ఎందుకు అన్నారు పెద్దలు .. రుచి ని కాసేపు పక్కనబెట్టి కొంత చరిత్రలోకి తొంగిచూస్తే..
సృష్టి కి ప్రతిసృష్టి చేసెట్ట విశ్వామిత్రుడు.. ఉదాహరణకి బీరకాయ బ్రహ్మచే సృష్టించబడితే నేతి-బీరికయ విశ్వామిత్రుడి సృష్టిట. అలాగే దోసకాయ - నక్క దోసకాయ
కాకరకాయ - ఆకాకరకాయ
అది ఆకాకరకాయ స్టోరీ....
ఇంక రుచి - shape అవీ ఇవీ అంటారా
రూపేణ కాకరకాయస్య రుచె బహుప్రీతస్య
అని జిహ్వ పురాణం లొ సొమశేఖరశర్మ అనే రుషి పుంగవుడు సెలవిచ్చాడు..
ఇంక పుల్లా - బెల్లం విషయానికి వస్తేపుల్లలేని కూర నేనొల్లనే పిల్లా అన్నడుట సొమశేఖరశర్మ వారి పెంకి బావ (నండూరి వారి నాయుడు బావలా)
పెళ్ళం ప్రేమ తీపి తెలీని బ్రహ్మచారులకి మరి బెల్లమె దిక్కు ... అది పుల్లా-బెల్లం యొక్క ఆవస్యకత...
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం
౧) ఆకాకరకాయ ని రెండు ముక్కలుగ తరగాలి (మరి చిన్న చిన్న ముక్కలుగ వద్దని భావం) పక్క ఉంచుకోవాలి
౨) ఒక మూకుడు (కొన్ని ప్రాంతాలలో బాండలి అని కూడా అంటారు) లొ బెల్లన్న్ని సన్నగా చెక్కులగ తరిగి (లేదా పంచదార/ చక్కెర) పాకం తయారు చేసుకోవలి...పాకమ్ అంతె పొయ్యిని సిమ్ లొ ఉంచి నీళ్ళు పోసి గరిటతొ కలుపుతూ ఉండాలి.. కొంచం జారు జారు గ వచ్చేవరకూ.
౩) అందులో చింతపండు రసం (లేదా పేస్టు) ని బాగ కలపాలి..కొంచంసేపు మరగనిస్తె మంచిది...
౪) తగినంత ఉప్పు కూడావేసి బాగ కలియబెట్టాలి౫) ఆ ఆకాకరకయ ముక్కలని ఈ పుల్లా-బెల్లమ్ ముద్దలో వేసి కొంచం నీళ్ళు పోసి ఉడకబెట్టాలి...
౬) చివరిగా కొంచం మినప పప్పు పోపు (తాళింపు) వేసి కలిపితే
మంచి బెల్లం వాసన వేసే ఆకాకరకాయ పుల్లా-బెల్లం కూర రెడే మీ కోసం...
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే...కాకరకయని చదివిస్తే అది కాస్త కీకరకయ అయ్యిందిట..
note: పై విధానాన్ని దొండకాయకి కూడా వర్తింపచేయొచ్చు...
disclaimer: try the recipe at your own risk. the author shall not be held responsible for implicit or explcit, stated or unstated, etc. etc. damages
tips for beginers: cooking is more of intution and improvisation. thoda gyaan

మనో వ్యధ

మనో వ్యధ
కులకాంత విలువలు మెచ్చదలంచిన
పరకాంతల వలువలు ఒలచితినందువేలఓ మూగ మనసా!

మసక బారిన వెలకాంత బ్రతుకుకు వెల్లవేయనెంచిన
సకల కాంతల కాంతుల చిదమమందువేలఓ మూగ మనసా!

పురుగు పట్టిన వటవృక్షపు ఊడను త్రెంచగోర
కూకటి వ్రేళ్ళతో పెకలించమందువేలఓ మూగ మనసా!

వసంతగానపు మధురిమలనందించు ఓ మేరు కోయిలా!
నీ శ్రావ్యస్వరమునాస్వాదించి హసించదలచిన
నీ మెఘవర్ణమునెంచి పరిహసించమందువేలఓ గండు కోయిలా!

పురివిప్పి నర్తించు, ఓ మనః మయూఖమా
నటరాజ సంభూతవని హర్షించదలచిన
నీ కాఠిన్య కంఠనాదము విని విగతమొందించమందువేలఓ పన్నగసంహారీ!

ఏమున్నవి ఏ పొత్తము చదువనెరింగిన, విషాక్షర బీజములు తప్ప,
ఏమున్నవి ఏ చిత్తము చదువనెరింగిన, అపనమ్మకపు అంకురములు తప్ప

నీ చిద్విలాసమునెరాంగ దలచిన నా తలంపులు,
మూసెన్ పసిహృదయగవాక్షముల తలుపులు

నా అస్త్రం వ్యర్ధం, నా శస్త్రం వ్యర్ధం
నా సంకలనం కలకలం, నా వ్యవకలనం కలకలం

నా జ్ణానచక్షువుల గమ్మిన అజ్ణానపు దొంతరలు తొలగింప,
విజ్ణానభిక్షువుడనై యాచింతు నిన్,
నా అహంకారపు తెరలు తొలగింపనను బ్రోవరా ఓ పరమేష్టి!

Sunday, January 16, 2005

ప్రేమ లేఖ

చాలించు ఇకనైన నీ బింకం, మన్నించు ఈ ప్రేమపిపాసి బొంకం
మన ప్రేమ గుడ్డిది, కాని కాదు అది చెడ్డది, అవును నిజమే మన ప్రేమ దొడ్డది,
మన ప్రేమ వెలుగు దివిటీ వంటిది, కాదు అది అవిటిది,
అవును నిజమే, మన ప్రేమ పవరు బ్రహ్మోసు వంటిది,
చెలియా, మన ఈ ప్రేమ నీకు అంకితం, లేదు మన ప్రేమకి చరమాంకం,
ఓ రేఖా, శశిరేఖా, అందుకో ఈ లేఖ!
దాటను నె ఎన్నడు నువ్ గీచిన సరళరేఖ,
జవదాటను, నీ ఆన, నే ఎన్నడు!

మన ప్రేమ

కొంచం నీరు + కొంచం నిప్పు : ఒక దొంగ
కొంచం భయం + కొంచం భక్తి : ఒక బెంగ
కొంచం టెక్కు + కొంచం నిక్కు : ఒక తంటా
కొంచం డబ్బు + కొంచం జబ్బు : ఒక అంధ ప్రేమ
అది కొంచం నీదీ + అది కొంచం నాదీ : అదే మన ప్రేమ

నా హితునికి

నా జీవిత గమనంలో నీ పరిచయం ఒక సుమధుర ఘట్టం,నీ స్నేహ సుమసౌరభాలు వెదజల్లెను పరిమళాలు నా డెందమందు,ఈ తాత్కాలిక్క ఎడబాటు, ఒక శాశ్వత బంధానికి తొలి మెట్టు మాత్రమే!గత సాంగత్యాన్ని నెమరువేస్తూ, ఆ స్మృతుల్ని వర్తమానంలో ఆశ్వాదిస్తూ,భవిష్యత్తులో నీ సహచర్యంకై వేచిచూస్తూ,
- నీ

Saturday, January 15, 2005

స్వాగతం!

అందరికి వందనం! తెలుగు బ్లాగుకు కి స్వాగతం!