స్వగతం

నా ఆత్మ ఘోష

Tuesday, June 21, 2005

మనో వ్యధ

మనో వ్యధ
కులకాంత విలువలు మెచ్చదలంచిన
పరకాంతల వలువలు ఒలచితినందువేలఓ మూగ మనసా!

మసక బారిన వెలకాంత బ్రతుకుకు వెల్లవేయనెంచిన
సకల కాంతల కాంతుల చిదమమందువేలఓ మూగ మనసా!

పురుగు పట్టిన వటవృక్షపు ఊడను త్రెంచగోర
కూకటి వ్రేళ్ళతో పెకలించమందువేలఓ మూగ మనసా!

వసంతగానపు మధురిమలనందించు ఓ మేరు కోయిలా!
నీ శ్రావ్యస్వరమునాస్వాదించి హసించదలచిన
నీ మెఘవర్ణమునెంచి పరిహసించమందువేలఓ గండు కోయిలా!

పురివిప్పి నర్తించు, ఓ మనః మయూఖమా
నటరాజ సంభూతవని హర్షించదలచిన
నీ కాఠిన్య కంఠనాదము విని విగతమొందించమందువేలఓ పన్నగసంహారీ!

ఏమున్నవి ఏ పొత్తము చదువనెరింగిన, విషాక్షర బీజములు తప్ప,
ఏమున్నవి ఏ చిత్తము చదువనెరింగిన, అపనమ్మకపు అంకురములు తప్ప

నీ చిద్విలాసమునెరాంగ దలచిన నా తలంపులు,
మూసెన్ పసిహృదయగవాక్షముల తలుపులు

నా అస్త్రం వ్యర్ధం, నా శస్త్రం వ్యర్ధం
నా సంకలనం కలకలం, నా వ్యవకలనం కలకలం

నా జ్ణానచక్షువుల గమ్మిన అజ్ణానపు దొంతరలు తొలగింప,
విజ్ణానభిక్షువుడనై యాచింతు నిన్,
నా అహంకారపు తెరలు తొలగింపనను బ్రోవరా ఓ పరమేష్టి!

0 అభిప్రాయము(లు):

Post a Comment

<< ప్రధానపుట